సైప్రస్ : ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద డ్రాల పరంపర కొనసాగుతున్నది. శుక్రవారం ప్రజ్ఞానంద, అండ్రె ఎసిపెంకో మధ్య జరిగిన ఐదో గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది.
ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ప్రజ్ఞానంద.. ఎసిపెంకోతో గేమ్‌ను 31 ఎత్తుల్లో డ్రాగా ముగించుకున్నాడు. దీంతో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో కొనసాగుతుండగా, జావోకిర్ సిండ్రోవ్ ప్రస్తుతం 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.