రిటైర్మెంట్పై వారిద్దరూ నాకు స్పష్టతనివ్వలేదు : యువరాజ్ సింగ్
తన కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తనకు రిటైర్మెంట్పై స్పష్టతనివ్వలేదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో యువీ మాట్లాడుతూ.. ‘కెరీర్ ముగింపు దశలో ఉన్నవారికి జట్టులో తమ స్థానంపై స్పష్టత అత్యంత ఆవశ్యకం. నేను అది పొందలేదు.
ఢిల్లీ : తన కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తనకు రిటైర్మెంట్పై స్పష్టతనివ్వలేదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో యువీ మాట్లాడుతూ.. ‘కెరీర్ ముగింపు దశలో ఉన్నవారికి జట్టులో తమ స్థానంపై స్పష్టత అత్యంత ఆవశ్యకం. నేను అది పొందలేదు. నాతో పాటు జహీర్, సెహ్వాగ్, హర్భజన్దీ అదే పరిస్థితి. కెప్టెన్, కోచ్, సెలక్టర్ సీనియర్లతో కూర్చుని చర్చించాలి. జట్టు అవసరాల రీత్యా పరిస్థితులను వారికి వివరించాలి. ఆ సంభాషణ సజావుగా సాగకున్నా కనీసం ప్రయత్నమైనా జరగాలి.
నా విషయానికే వస్తే ఆ సమయంలో రిటైర్మెంట్పై నాకు స్పష్టత లేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ, కెప్టెన్, కోచ్ నుంచి కూడా ఏ స్పందనా లేదు. అప్పటికే నేను 37వ పడిలో ఉన్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కనీసం దేశం కోసం అన్ని మ్యాచ్‌లు ఆడినవారికి కనీసం గౌరవం అయినా దక్కాలి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన అనంతరం యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పుడు కోహ్లీ భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇదిలాఉండగా కోహ్లీ, రవిశాస్త్రి తన కెరీర్‌పై స్పష్టతనివ్వకపోయినా ధోనీ మాత్రం వాస్తవ పరిస్థితిని చెప్పాడని యువీ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

