న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి రావడం కూటమిలో విభేదాలకు కేంద్ర బిందువైంది. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిని ప్రకటించని క్రమంలో ఎమర్జెన్సీ అనంతరం 1977 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని అభ్యర్ధి పేరును ప్రకటించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యలు కూటమిలో లుకలుకలను బహిర్గతం చేశాయి.
ఇక ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించాయి. ఇక 1977 లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించిన అనంతరం మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవి చేపట్టారని, ప్రధాని పేరును ప్రకటించనంత మాత్రాన కోల్పోయేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు మార్పు దిశగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని పవార్ స్పష్టం చేశారు.
మరోవైపు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిగా ఖర్గే పేరును దీదీ ప్రతిపాదించగా కాంగ్రెస్ సైతం సంతోషంగా లేదని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. విపక్ష ఇండియా కూటమిలో చీలిక మరోసారి బట్టబయలైందని ట్విట్టర్ వేదికగా పూనావాలా పేర్కొన్నారు.
Read More :
Saveera Parkash | పాక్లో జనరల్ ఎలక్షన్స్.. బరిలో నిలిచిన హిందూ మహిళ