షాంఘై (చైనా): భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న, తన సహచర ఆటగాడు ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) ఏటీపీ మాస్టర్స్ 1000 షాంఘై టోర్నీ రెండో రౌండ్‌కు ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-డొడిగ్ జోడీ.. 6-4, 6-3తో వరుస సెట్లలో పాబ్లొ కరెనొ-పెడ్రొ మార్టిన్ (స్పెయిన్)ను వరుస సెట్లలో ఓడించింది.