ICC : వెస్టిండీస్ యువ పేసర్ షమర్ జోసెఫ్ (Shamar Joseph) తొలి టెస్టు సిరీస్‌లోనే ప్రకంపనలు సృష్టించాడు. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాపై 7 వికెట్లు తీసి విండీస్‌కు చిరస్మరణీయ విజయం అందించి ఒక్కసారిగా హీరో అయిన జోసెష్.. తొలి సిరీస్‌తోనే ఐసీసీ అవార్డు గెలిచాడు. జనవరి నెలకు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (player of the month) అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్(Ollie Pope), ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood)లను వెనక్కి నెట్టి మరీ విజేతగా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఐర్లాండ్ క్రికెటర్ అమీ హంటర్(Amy Hunter) అవార్డు అందుకుంది.
Shamar Joseph had an incredible January 2024 that won him the ICC Men’s Player of the Month 🎉https://t.co/0Ump7FHEPL
— ICC (@ICC) February 16, 2024
మహిళల విభాగంలో అమీ హంటర్‌తో పాటు ఆస్ట్రేలియా ప్లేయర్లు బేత్ మూనీ, అలీసా హేలీలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే.. ఓటింగ్‌లో ఎక్కువ ఓట్లు సాధించిన హంటర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎగరేసుకుపోయింది.
18-year-old Amy Hunter continues to impress 🌟https://t.co/oPa7kyXO3W
— ICC (@ICC) February 17, 2024
ఆస్ట్రేలియా కంచుకోట అయిన గబ్బాలో షమర్ నిప్పులు చెరిగాడు. పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బొటన వేలికి గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన అతడు.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. ఏకంగా ఆరు వికెట్లు తీసి విండీస్ చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు. ఆరంగేట్రం సిరీస్‌లోనే 7-68 గణాంకాలతో క్రికెట్ దిగ్గజాలను ఆశ్చర్యపరిచాడు. దాంతో, ఆసీస్ గడ్డపై 30 ఏండ్ల తర్వాత కరీబియన్ జట్టు తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
షమర్ జోసెఫ్
మరోవైపు భారత పర్యటనలో భాగంగా ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టులో ఓలీ పోప్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులతో ఇంగ్లండ్‌కు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం భారీ ఛేదనలో టీమిండియాను టామ్ హర్ట్లే ఆరు వికెట్లతో దెబ్బకొట్టాడు. దాంతో, ఉప్పల్‌లో ఓటమెరుగని భారత జట్టుపై బెన్ స్టోక్స్ సేన అద్భుత విజయం నమోదు చేసింది. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. 11.63 సగటుతో 19 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు.