Jonny Bairstow: ఇంగ్లండ్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow)కు భారత పర్యటన ఈసారి కూడా కలిసిరావడం లేదు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన అతడు రాజ్‌కోట్ టెస్టు(RajKot)లోనూ నిరాశపరిచాడు. జో రూట్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బెయిర్‌స్టో.. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, భారత జట్టుపై అత్యధికంగా డకౌట్ అయిన తొలి ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియాపై బెయిర్‌స్టో ఖతా తెరవకుండానే వెనుదిరగడం ఇది ఎనిమిదోసారి. తద్వారా అతడు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish Kaneria), ఆస్ట్రేలియా లెజెండ్ నాథన్ లియాన్(Nathan Lyon) రికార్డును బ్రేక్ చేశాడు. కనేరియా, లియాన్లు చెరో ఏడుసార్లు డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌లు చెరో ఆరుస్లారు సున్నాకే పెవిలియన్ చేరి మూడో స్థానంలో నిలిచారు.
Jonny Bairstow has a habit of getting out early vs India in Tests ☹️#INDvENG pic.twitter.com/G0QkGteI5q
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024
విధ్వసంక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన బెయిర్‌స్టో నిరుడు యాషెస్ సిరీస్(Ashes Series)లో రెచ్చిపోయి ఆడాడు. దాంతో, భారత పర్యటనలో అతడు ఇరగదీస్తాడని మేనేజ్మెంట్ నమ్మింది. కానీ, అతడు మాత్రం పేలవమైన ఆటతో నిరాశపరుస్తున్నాడు.
బెయిర్‌స్టో
గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో బెయిర్‌స్టో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేదు. 19.60 సగటుతో 98 రన్స్ మాత్రమే చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 37. మూడేండ్ల క్రితం భారత పర్యటనలోనూ బెయిర్‌స్టో ఆకట్టుకోలేదు. అప్పుడు రెండు టెస్టుల్లో 28 పరుగులకే పరిమితమయ్యాడు.