Shahar Ki Baat | చిన్నప్పటి నుంచి అనేక క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాము. ఇతర రాష్ర్టాల్లో కూడా వేడుకలు చూశాను. తెలంగాణ వచ్చినంక, కేసీఆర్ గారు సీఎం అయ్యాక పేద చర్చిల్లో క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరిగినంత ఘనంగా మరెక్కడా జరగలేదు. భోజనాలు పెట్టాలని, దుస్తులు కావాలని ప్రభుత్వాన్ని మేమెన్నడూ కోరలేదు. కేసీఆరే అడగకుండా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు ఇవ్వాలనుకునే నిర్ణయం మాకు సంతోషం కలిగించింది.
క్రైస్తవ మైనారిటీలను ఏ ప్రభుత్వం గుర్తించలేదు. కేసీఆర్ నిర్ణయం మా ఆత్మగౌరవాన్ని పెంచింది. క్రిస్మస్ వస్తుందంటే పేద క్రైస్తవులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ల సంతోషాన్ని కేసీఆర్ కానుకలు రెట్టింపు చేశాయి. కేసీఆర్ ప్రతి క్రిస్మస్కు అందరికీ దుస్తులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం లక్ష రూపాయల నిధులిచ్చింది. మా చర్చిలో మూడు వందల మంది పేద క్రైస్తవులతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నాం. ఇంతకుముందు క్రిస్మస్ నిర్వహణ కష్టంగా ఉండేది. ఆ లక్ష రూపాయల సహాయంతో క్రైస్తవులకు బిర్యానీతో విందు ఏర్పాటు చేశాం. క్రిస్మస్ కానుకగా కేసీఆర్ అందించిన దుస్తులు పంచేటప్పుడు పేదలు ఎంతో సంతోషంగా స్వీకరించారు. ఒక పేదరాలు వచ్చి అయ్యా.. నా కొడుకు కూడా పండుగ కోసం నాకు కొత్త బట్టలు కొనివ్వలేదని, కొడుకులాగే కేసీఆర్ కొత్త చీర ఇచ్చిండని సంతోషంగా చెప్పింది. ఇటువంటి క్రిస్మస్ని ముందెన్నడూ జరుపుకోలేదు.
ఇటువంటి కార్యక్రమాలను ఇకముందూ కొనసాగించాలి. కేసీఆర్ పెద్ద కుమారుడిలా మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. కేసీఆర్కు వందనాలు. కేసీఆర్ను ఆయన ప్రభుత్వాన్ని దేవుడు చల్లగా దీవించుగాక.
– వెలమర్తి కిరణ్, పాస్టర్, ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం, పాటిగడ్డ కాలనీ, బేగంపేట, హైదరాబాద్