Shah Rukh Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తన 60వ పుట్టిన రోజున అభిమానులను కలవలేకపోయారు. ప్రతి ఏడాది తన బర్త్ డేన ముంబైలోని నివాసం మన్నత్(Mannat)కు వచ్చే వేలాదిగా తరలివచ్చే ఫ్యాన్స్‌కు అభివాదం చేసే షారుక్ ఈసారి మీటింగ్ రద్దు చేసుకున్నారు. తనను విష్ చేసేందుకు మన్నత్ వద్ద వేచి ఉన్న అభిమానులను కలవలేకపోయినందుకు షారుక్ క్షమాపణలు తెలిపారు. ఆదివారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన ఫ్యాన్ మీటింగ్ రద్దు చేసుకోవడానికి గల కారణాలను అందులో పేర్కొన్నారు.
‘నాకోసం ఎదురు చూస్తున్న మిమ్మల్ని కలవాలని అనుకున్నా. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు మీటింగ్ రద్దు చేసుకోవాలని సూచించారు. భారీగా పోగైన మిమ్మల్ని అదుపు చేయడం సాధ్యం కాదని, అందరి భద్రతను పరిగణనలోకి తీసుకొనే నేను ఫ్యాన్ మీటింగ్‌కు రాలేకపోయాను. మిమ్మల్ని కలువలేకపోయినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. నన్ను అర్ధం చేసుకున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
Have been advised by authorities that I will not be able to step out and greet all you lovely people who have been waiting for me.
My deepest apologies to all of you but have been informed that it is for the overall safety of everyone due to crowd control issues.Thank you for…
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025
పుట్టినరోజున నన్ను చూడాలనుకున్న మీ కంటే.. మిమల్ని చూడనందుకు నేనే ఎంతో బాధపడుతున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. లవ్ యూ ఆల్’ అని తన షారక్ తన పోస్ట్‌లో వెల్లడించారు. తమ అభిమాన హీరో పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కొందరు ‘పర్లేదు.. అందరం క్షేమంగా ఉండాలి. కానీ, ఈరోజు రాత్రి ముంబై మిమ్మల్ని మిస్ అవుతుంది’ అని భావోద్వేగపూరితమైన కామెంట్లు పెడుతున్నారు.