World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో అర్ధ శతకం బాదిన షఫాలీ వర్మ (2-6)బంతితోనూ చెలరేగుతోంది. పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన ఆమె రెండు కీలక వికెట్లు పడగొట్టింది. క్రీజులో పాతుకుపోయిన సునే లుస్(25)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపిన షఫాలీ తర్వాతి ఓవర్లో మరిజానే కాప్(4)ను ఔట్ చేసి సఫారీలను గట్టి దెబ్బకొట్టింది.
భారీ ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు కెప్టెన్ లారా వొల్వార్డ్త్(65 నాటౌట్), సునే లుస్(). వీర్దిదరి జోడీని విడదీసేందుకు హర్మన్‌ప్రీత్ పార్ట్‌టైమ్ బౌలర్ షఫాలీకి బంతిని అందించింది. ఆమె.. రెండో బంతికే లుస్ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసింది.
What a bowling change 😍
Shafali Verma now has a #CWC25 wicket to her name 🥳
Updates ▶ https://t.co/TIbbeE4ViO#TeamIndia | #WomenInBlue | #INDvSA | #Final | @TheShafaliVerma pic.twitter.com/Sz8WaWfasR
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
ఆ తర్వాతి ఓవర్లోనే డేంజరస్ మరిజానే కాప్(4 )ను సైతం ఔట్ చేసింది తను. లెగ్ సైడ్ పడిన బంతిని మరిజానే లెగ్ సైడ్ ఆడాలనుకుంది. కానీ, వికెట్ కీపర్ రీచా సూపర్ క్యాచ్ అందుకోవడంతో సఫారీల నాలుగో వికెట్ పడింది. 25 ఓవర్లకు స్కోర్.. 127-4.