Premante Teaser | ప్రియదర్శి, ఆనంది కాంబోలో వస్తోన్న చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్ యూ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పాపులర్ యాంకర్ సుమ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
మీకేం అంచనాలు లేవు.. మ్యారేజ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని ఆనందిని అడుగుతుంటే..ఉదాహరణకు నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి నా వళ్ల ఎలాంటి సమస్యలు రాకూడదని నేనుకుంటా అని ప్రియదర్శి అంటున్నాడు. ఇక పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్‌గా ఉండాలి అంతే.. రోజంతా కోట్లాడుకున్నా.. ఎంత కోపమొచ్చినా.. కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసి ప్రేమతోనే పడుకోవాలి. అట్లాంటి పెళ్లి కావాలి నాకు అంటోంది ఆనంది.
ఇక రమ్య సెకండ్ సెటప్ లాంటిదేమి లేదు ప్లీజ్ అంటున్నాడు ప్రియదర్శి. మొత్తానికి పెళ్లికి ముందు భిన్న అభిప్రాయాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు.. పెళ్లి తర్వాత భార్యభర్తలుగా మారాక ఎలాంటి సంఘనలు జరిగాయనే నేపథ్యంలో ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో పక్కా వినోదాన్ని అందించేలా సినిమా ఉండబోతుందని టీజర్ హింట్ ఇచ్చేస్తుంది.
ఆహ్లాదభరితమైన ప్రేమకథగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియదర్శి పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. నవనీత్ శ్రీరామ్ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.