Kuldeep Yadav : ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్వదేశానికి రానున్నాడు. వన్డే, పొట్టి సిరీస్ స్క్వాడ్‌కు ఎంపికైన కుల్దీప్ను టెస్టు సన్నద్ధత కోసం వెనక్కి పిలిచింది బీసీసీఐ. మూడో టీ20 తుది జట్టులో లేని ఈ చైనామన్ బౌలర్ త్వరలోనే భారత ఏ జట్టు స్క్వాడ్‌తో కలువనున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం ప్రాక్టీస్‌గా ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు కుల్దీప్. దాంతో.. ఆసీస్‌తో చివరి రెండు టీ20లకు ఈ మిస్టరీ స్పిన్నర్ అందుబాటులో ఉండడు.
మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్న కుల్దీప్ దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో కీలకం కానున్నాడు. అందుకే.. అతడు బౌలింగ్ సన్నద్ధత కోసం దక్షిణాఫ్రికా ఏతో రెండో అనధికారిక టెస్టులో ఆడనున్నాడు. కుల్దీప్తో పాటు సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్, వికెట్ కీపర్ ధ్రవ్ జురెల్ కూడా ఈ మ్యాచ్ కోసం రెఢీ అవుతున్నారు.
🚨Kuldeep Yadav has been released from India’s T20I squad and will not play the 4th and 5th T20Is against Australia
He will fly to Bengaluru instead and play for India A in the 2nd Unofficial Test against South Africa #IndianCricket pic.twitter.com/kKkSb1jMUE
— Cricbuzz (@cricbuzz) November 2, 2025
భారత స్క్వాడ్ (నాలుగు, ఐదో టీ20లకు) : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా,
భారత జట్టు ఏ స్క్వాడ్ (రెండో అనధికారిక టెస్టు) : రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్(వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కొతియాన్, మానస్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అకాశ్ దీప్, సిరాజ్, కుల్దీప్ యాదవ్.
భారత ఏ, సఫారీ ఏ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్(90) హాఫ్ సెంచరీతో చలెరేగాడు. బంతితో తనుష్ కొతియాన్ రెచ్చిపోగా 3 వికెట్ల తేడాతో గెలుపొందిందింది టీమిండియా. తదుపరి రెండో మ్యాచ్ నవంబర్ 6 నుంచి జరుగనుంది.