ముంబై: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ పేసర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఒక మహిళ ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన రియాజ్ భాటీ భార్య రెహనుమా.. ఈ అంశంపై సెప్టెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమీత్ ఠక్కర్ అనే వ్యక్తి ఆ కైంప్లెంట్ కాపీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కాంటినెంటల్ హోటల్లో మునాఫ్ పటేల్‌తో, ట్రైడెంట్ హోటల్లో హార్దిక్ పాండ్యాతో శృంగారం చేయమని భర్త రియాజ్ తనను బలవంతం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్న హార్దిక్ పాండ్యా తన స్నేహితులతో కలిసి తనతో అసహజ శృంగారం చేశాడని ఆరోపించింది. ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ సింగ్ ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ.. ‘ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం ఈ అంశంపై ఎక్కువ మాట్లాడలేం’ అని అన్నారు. కాగా ఫిర్యాదు చేసి ఇన్నాైళ్లెనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని రెహనుమా వాపోయింది.