కుట్రలను ఛేదించి గులాబీ గూటికి
ఉద్యమాల గడ్డ ఓరుగల్లు నుంచే కాంగ్రెస్‌కు ఊహించని షాక్ మొదలైందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి పర్యటనలు రేవంత్ సర్కార్‌లో వణుకు పుట్టిస్తున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
- ఓరుగల్లులో గులాబీ జన చైతన్యం..కాంగ్రెస్‌లో మొదలైన భయం
- బీఆర్ఎస్ పార్టీలో చేరే నేతలపై కేసులు, భౌతికదాడుల ప్రచారం
- బీఆర్ఎస్లోకి పలువురు మాజీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు
వరంగల్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాల గడ్డ ఓరుగల్లు నుంచే కాంగ్రెస్‌కు ఊహించని షాక్ మొదలైందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి పర్యటనలు రేవంత్ సర్కార్‌లో వణుకు పుట్టిస్తున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ కుట్రలను ఛేదించి వందలాది మంది ఆ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జన చైతన్యసభ నిర్వహిస్తున్నారని, ఆ సభలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య నాయకులు పలువురు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకోనున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో గుబులు మొదలైంది.
ఆ చేరికలను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు వారి రౌడీ అనుచరులను ఉసిగొలిపి భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చారు. ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లపై గత ఆరోపణలను జల్లెడపట్టి, ఆ ఆరోపణలు చేసిన బాధితులను వెతికిపెట్టి వారిపై రెండు మూడు రోజుల వ్యవధిలో కేసులు నమోదు చేసి, వారిండ్ల చుట్టూ పోలీసులను పంపి అరెస్టు చేయించేందుకు నానా తంటాలు పడ్డారు. ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లపై ‘టాస్క్‌ఫోర్స్’ పోలీసుల పేరుతో రెండు మూడు రోజులుగా దాడులకు పాల్పడ్డారనే ప్రచారం గుప్పుమన్నది.
శనివారం తెల్లవారుజామున వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్‌ను తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లే క్రమంలో ఆయన వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొన్నారన్న ప్రచారం ఆదివారం గుప్పుమన్నది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ‘బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదైంది. కానీ, పరారీలో ఉన్నారు’ అని పోలీసులు పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో టాస్క్‌ఫోర్స్ పేరుతో తాము మాజీ నాయకుడిని అదుపులోకి తీసుకోలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ చేపడుతామని పోలీసులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ విషవలయాన్ని దాటి..
కాంగ్రెస్ పార్టీ కుట్రలను, ప్రజాప్రతినిధుల ప్రైవేట్ సైన్యం విష వలయాన్ని ఛేదించుకొని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అనేకమంది మాజీ కార్పొరేటర్లు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
జనచైతన్య సభ పేరుతో జరిగిన సభలో ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత గౌరి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్లు వస్కుల బాబు, బోగి సురేశ్, ముస్కమల్ల అరుణా సుధాకర్, వీర భిక్షపతి, జాన్‌వెస్లీతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, వందలాది మంది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
విద్యావేత్త తిరుపతిరెడ్డితోపాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారనే విషయం తెలియగానే మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇలా వారి పరిధిలోని మాజీ కార్పొరేటర్లను పిలిపించుకొని ‘బీఆర్ఎస్లో మా పార్టీ నుంచి ఎవరూ చేరడం లేదు’ అని మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం తమ నియోజకవర్గం నుంచి ఎవరూ బీఆర్ఎస్లో చేరట్లేదని ప్రకటించుకున్నా సరే కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడాన్ని నిలువరించకపోయారు.
సీఎం రేవంత్‌రెడ్డి మూడేండ్ల క్రితం ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదాన్నీ నిలబెట్టుకోలేదని, ఫలితంగానే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రత వ్యతిరేకత నెలకొన్నది. ఇది ఇలాగే కొనసాగితే తమ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని నిర్దారణకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధులు, కీలకనేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనడానికి తాజా చేరికలే నిదర్శనం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

