రిలయన్స్ సహా టాప్-7 ఎం-క్యాప్ రూ.1.07 లక్షల కోట్లు హరీ

ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులతో టాప్-10 కంపెనీల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పతనమైంది. ఈ ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,07,566.64 కోట్లు తగ్గింది. ఇందులో సగం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేసన్ నష్టపోవడం ఆసక్తికర పరిణామం. ఇక బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 849.74 పాయింట్లు కోల్పోయింది. అ
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.55,565.21 కోట్లు తగ్గిపోయి రూ.12,64,243.20 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ విలువ రూ.2,408.22 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,467.63 కోట్ల మేరకు నష్టపోయాయి.
ఐటీ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,751.92 కోట్లు పతనమైంది. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,494.45 కోట్ల మేరకు కోల్పోయింది.
హెచ్డీఎఫ్సీ రూ.6,313.77 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.16,197.55 కోట్లు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ విలువ రూ.11,681.66 కోట్ల మేరకు ఎం-క్యాప్ కోల్పోయాయి. అయితే, హెచ్‌యూఎల్ రూ.364.19 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.62.77 కోట్లు, టీసీఎస్ తమ మార్కెట్ విలువకు రూ.1,812.54 కోట్లు జోడించాయి.
ఇక బీఎస్ఈలో టాప్ 10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ యధాతథంగా తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.
ఇవి కూడా చదవండి:
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్
టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- reliance
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

