ఓపెన్న్యూయార్క్: దిగ్గజ టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ కెరీర్‌కు తెరపడింది! యూఎస్ ఓపెన్‌తో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న సెరెనా శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అజ్లా టామ్జానొవిక్ చేతిలో 5-7, 7-6 (4), 1-6తో ఓటమి పాలైంది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా తనకిష్టమైన యూఎస్ ఓపెన్‌తోనే కెరీర్‌కు సగర్వంగా గుడ్‌బై చెప్పనున్నది. సెరెనా స్వయంగా విరమణ గురించి తెలుపకున్నప్పటికీ ఇటీవల ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్టు తెలుపడంతో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన యూఎస్ ఓపెన్‌కు మించిన వేదిక వేరే ఏముంటుందని అందరూ భావిస్తున్నారు.
తాజా యూఎస్ ఓపెన్‌లో మూడు మ్యాచ్‌లలో సెరెనా హోరాహోరీగా పోరాడింది. ముఖ్యంగా రెండో రౌండ్లో రెండో ర్యాంకర్ ఆనెట్ కొంటివిట్పై విజయం చరమాంకంలోనూ ఆమె పోరాటపటిమకు అద్దంపట్టింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ టెన్నిస్ లేని జీవితాన్ని ఊహించుకోలేనన్నది. జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నది. కాగా సెరెనాకు వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపిన దిగ్గజాలలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లె, టెన్నిస్ మాజీ మేటి క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్, మైఖేల్ ఫెల్ప్స్, టైగర్ ఉడ్స్ తదితరులు ఉన్నారు.
మరోవైపు పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ డేనియల్ మెద్వెదెవ్ 6-4, 6-2, 6-2తో చైనా క్వాలిఫయర్ వు యిబింగ్పై సునాయాసంగా గెలిచాడు.