హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో సేవలందించి, అందరి మన్ననలు పొందిన సీనియర్ జర్నలిస్టు ఎంఏ రహీం అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. రహీం మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. విలువలతో కూడిన జర్నలిస్టుగా రహీం ప్రత్యేకతను చాటుకున్నారని, వారి మరణం ఉర్దూ జర్నలిజానికి తీరని లోటని పేర్కొన్నారు, వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే రహీం ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబసభ్యులకు కష్ట సమయంలో ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీడియా ప్రముఖులు నివాళులర్పించారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 1:15 గంటలకు జోహర్ నమాజ్ అనంతరం (మహావీర్ హాస్పిటల్ పకన) ఏసీ గార్డ్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.