హైదరాబాద్ : కాంగ్రెస్ ( Congress ) లో కుమ్ములాటలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌పై, ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా వాటికి కొనసాగింపుగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీసీ నాయకుడు మధుయాష్కీ ( Madhu Yashki ) పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు కొత్త విద్య తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎల్బీనగర్లో స్పా సెంటర్లు ( Spa Centres ) నడుపుతున్న వ్యక్తికి మధుయాష్కీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని విమర్శించారు. ఎల్బీనగర్లో మూడు, నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తూ, వ్యభిచారం చేయిస్తూ అరెస్టయిన కేతవత్ రమేష్ నాయక్‌కు మధుయాష్కీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని పేర్కొన్నారు.
స్పా సెంటర్ల నిర్వహణ వెనక మధుయాష్కీ అనుచరుల హస్తం ఉన్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందని, ఈ వ్యవహారంపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని లేఖను రాశారు.