FIR on Pellet Gun Case : ఢిల్లీ పెల్లెట్ గన్ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేశారు. తొలుత ‘కుదరదు’ అని చెప్పిన పోలీసులు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో మరో దారిలేక.. ఎఫ్ఐఆర్కు సరేనన్నారు. పెల్లెట్ గన్ బాధితుడు సాహిల్ లొచాబ్(Sahil Lochab) ఫిర్యాదు అనంతర అతడి నుంచి దవాఖాన నివేదికలు, ఇతర కాగితాలను తీసుకొని కేసు నమోదు చేశారు.
‘ఛలో పార్లమెంట్’ సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. పోలీసుల తీరును నిరసిస్తూ.. బాధితుడు సాహిల్ లొచాబ్ పక్షాన నిలిచిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎఫ్ఐఆర్ నమోదుకు పట్టుపట్టారు. శుక్రవారం ఆయన బాధితుడితో కలిసి ఢిల్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
VIDEO | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi (@RahulGandhi) holds a sit-in protest at Sansad Marg Police Station, demanding the registration of an FIR over pellet injuries sustained during the July 20 protest.
(Full video available on PTI Videos -… pic.twitter.com/gZTshqPG1l
— Press Trust of India (@PTI_News) August 21, 2026
కానీ, పోలీసులు ఎఫ్ఐఆర్కు తిరస్కరించగా రాహుల్ వెనక్కి తగ్గలేదు. తాడోపేడో తేలేదాకా కదిలేది లేంటూ స్టేషన్ ముందే బైఠాయించారు. దాంతో.. దిగొచ్చిన పోలీసులు బాధితుడు సాహిల్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెల్లెట్ గన్ గాయాలకు సాక్ష్యాలుగా అతడి నుంచి మెడికల్ రిపోర్టులు, ఇతర డాక్యుమెంట్లను తీసుకున్నారు.
నీట్ ప్రశ్నాపత్ర లీకేజీపై జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జూలై 20వ తేదీన ఛలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థులపై, నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్స్ వాడడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో సాహిల్ లొచాబ్ అనే 19 ఏళ్ల విద్యార్థి ఓ కన్నుకు తీవ్ర గాయమైంది. అతడి ఒంటిపై పలుచోట్ల పెల్లెట్ గన్ గాయాలున్నాయి.
Rahul Gandhi ji sat on a protest outside the police station, accompanied by a pellet gun victim sahil .
An FIR was not registered, he sat on a protest in front of the DCP’s office. #RahulGandhi #Congress @RahulGandhi pic.twitter.com/gccl0Bn8xs
— Praveen Singada (@davidbuntix) August 21, 2026
చివరిసారిగా 2010లో కశ్మీర్లో నిరసనకారులపై ఉపయోగించిన పెల్లెట్ గన్స్‌ను విద్యార్థులపై ప్రయోగించడంపై మండిపడిన రాహుల్ గాంధీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తప్పుపట్టారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించాలని పోలీసులకు ఆదేశాలిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన .. చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసేంతవరకూ వెనక్కి తగ్గలేదు.