ఇబ్రహీంపట్నం, మార్చి 13: ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ టోర్నీలో తెలంగాణ తరఫున రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈనెల 21 నుంచి జమ్ముకశ్మీర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి రాష్ట్ర ఆర్చరీ సంఘం ఆదివారం జట్లను ఎంపిక చేసింది. ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల సౌజన్యంతో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. మూడు విభాగాల్లో జరిగిన సెలక్షన్స్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 200 మంది ఆర్చర్లు హాజరయ్యారు. అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన 24 మందిని ఆర్చరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కామినేని ఎంపిక చేశారు.