న్యూఢిల్లీ: భారత క్రికెట్లో విడాకుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిచ్ విడిపోగా, ఇటీవల చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నట్లు వార్తలు రాగా తాజగా క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తీ వివాహ బంధానికి త్వరలో ముగింపు పడనుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. గత కొన్ని రోజులుగా అంటిముట్టన్నట్లు ఉంటున్న సెహ్వాగ్, ఆర్తీ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు జాతీయ వార్తాసంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
ఆర్తీ తన సోషల్మీడియా అకౌంట్లో సెహ్వాగ్ ఫొటోలు తీసేయడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. సరిగ్గా 20 ఏండ్ల క్రితం 2004లో పెండ్లి చేసుకున్న సెహ్వాగ్, ఆర్తీ దంపతులకు ఆర్యవీర్, వేదాంత్ ఇద్దరు పిల్లలు.