హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల ఎన్నికలు జరుగని 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33.62 కోట్లు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఎన్నికలు జరుగలేదన్న కారణంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అందకపోయినా, గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నిధులు సమకూర్చినట్టు సోమవారం విలేకరులకు తెలిపారు.
ఎల్నినోతో ఎదురయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదురొనేందుకు గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సీతక ఆదేశించారు. సోమవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ప్రతి పంచాయతీని మాడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.