హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): భూసేకరణ, పునరావాసం కోసం ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన రూ.813 కోట్ల నిధులను జాప్యం లేకుండా సంబంధిత రైతులకు తక్షణం చెల్లించాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
ఉన్నతాధికారులు, కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ను మంత్రి ఉత్తమ్ సోమవారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడు తూ.. భూసేకరణ, పునరావాస చెల్లింపులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, విడుదలైన నిధులు ప్రభుత్వ ఖాతాల్లో మూలుగుతుంటే సహించేది లేదని హెచ్చరించారు.