హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు. బేస్మెంట్ లేదా పైస్థాయికి చేరిన ఇండ్లకు వన్‌టైమ్ ద్వారా క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఎల్-3 నుంచి ఎల్-1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అర్హత ఉన్న నిర్మాణాల్లో నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో ఎల్-3 మంజూరుకు దీనిని ప్రాతిపదికగా పరిగణించరాదని స్పష్టంచేశారు.