హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రాంతంలో కరువు పరిస్థితులను చూసి కండ్లనీళ్లు పెట్టుకొన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. శుక్రవారం జనగామ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఏడుపు ఆగలేదు
ప్రొఫెసర్ జయశంకర్ బతికున్నపుడు తెలంగాణ ఉద్యమం కోసం ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు మంచి నీళ్ల అమ్మకాలు, ఎండిపోయిన చేన్లు, ఎండిపోతున్న చెట్లు.. కొన్ని ప్రాంతా ల్లో తాటిచెట్లు కూడా ఎండిపోవడం చాలా దుర్భరంగా అనిపించేది. ఆనాటి బాధలు చూసి ఎప్పుడు తెలంగాణ రావాలె, ఎప్పు డు ఈ ప్రాంతం బాగుపడాలె అని కండ్లనీళ్లు పెట్టుకొన్న సందర్భాలు చాలా ఉన్నయి. ఒకరోజు బచ్చన్నపేట మీదుగా పోతుం టే.. మా దగ్గర మాట్లాడి పోవాలె అని అడిగితే చౌరస్తా కాడ ఆపినం.
ఆ రోజుల్లో కేసీఆర్ మీటింగ్ అంటే ఎక్కడ చూసినా 90 నుంచి 95 శాతం యువకులే ఉండేది. కానీ బచ్చన్నపేట సభలో ఒక్క యువకుడు కూడా కనిపియ్యలే. మొత్తం ముసలోల్లే. ఇదేం ది అని అడిగితే.. ‘ఎనిమిదేండ్ల నుంచి కరువు. బచ్చన్నపేట చెరు వు నిండి ఏడేండ్లయింది. మంచినీళ్లను నాలుగైదు కిలోమీటర్ల నుంచి బండిమీద తెచ్చుకుంటున్నం. యువకులంతా పొట్టచేత పట్టుకొని వెళ్లిపోయిన్రు. వాళ్లు పంపిన డబ్బులతోని కంట్రోల్ బియ్యం కొనుక్కొని ఈ ముసలివాళ్లు బతుకుతున్నరు’ అని చెప్పినరు. ఆ బాధలు విని ఆవేశం పట్టలేక సభలోనే ఏడ్చిన. గోదావరి ఒరుసుకొని పారే వరంగల్ జిల్లాల ఈ దరిద్రం ఎట్లా ఉంటదని బాధపడ్డా. ఆ రోజంతా దాని గురించే మాట్లాడుకున్నం.
బతుకులు బాగుపడ్డయి
ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇకపై వరంగల్ జిల్లాకు కానీ, తెలంగాణకు కానీ కరవు అనేది రాదు. చాలా కష్టపడి అనేక మందిని కోల్పోయి, దెబ్బలపడి, జైళ్లల్ల పడి, 14 ఏండ్లు తండ్లాడి, పానం పోయేదాక కొట్లాడి.. చివరికి తెలంగాణ తెచ్చుకొన్నం. భగవంతుని దయ, ప్రజల దీవెన.. తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు ఉంటేనే తెలంగాణ కోసం తండ్లాడుతరని ప్రజలు మాకు పరిపాలన బాధ్యతలు అప్పగిస్తే.. కొన్ని ఫలితాలు సాధించుకున్నం. నిన్నియ్యాల మొఖం జెర తెల్లవడుతున్నది. బచ్చన్నపేట కాడ బతుకులు బాగుపడుతున్నయి.
త్వరలో నియోజకవర్గాల పర్యటన
మరికొన్ని రోజుల్లో నియోజకవర్గాల్లో పర్యటనను మొదలుపెడుతా. ఏమేం కావాలో అన్ని నియోజకవర్గాల ప్రజలను స్వయంగా అడుగుతా.
జనగామకు వరాలు