జోగులాంబ గద్వాల : విత్తన పత్తి రైతులపై ( Seed cotton farmers ) జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ (Ranjith Kumar) ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై ( Knees ) కూర్చుని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు.
విత్తన పత్తి ప్యాకెట్ ధర పెంచాలని , ఫెయిల్ అయిన విత్తనాలకు రీ శాంపిల్ చేయాలని కోరుతూ కన్వీనర్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో 35 వేల మంది రైతులు విత్తనపత్తిని సాగు చేస్తున్నారని చెప్పారు. కంపెనీలు ఇచ్చే వాస్తవ విత్తనాలను రైతులకు అందించకుండా ఆర్గనైజర్లు విత్తన ప్యాకెట్ ధరల విషయంలో, అడ్వాన్సుల విషయంలో రైతులకు చెప్పకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీలు ఆర్గనైజర్లకు విత్తనాలు ఇవ్వకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులు పంట పండించిన తర్వాత ఆర్గనైజర్ల ద్వారా ఆయా కంపెనీలకు రైతులు విత్తనపత్తినిస్తున్నారని ఈ విధంగా సేకరించిన పత్తిని ఆయా జీఓటీ పరీక్షను నిర్వహించి ఫలితాలు రావడానికి రెండు నెలలు గడువు ఉంటుందన్నారు. కానీ ఆర్గనైజర్లు మాత్రం మళ్లీ పంట కాలం వరకు ఫలితాలను చెప్పడం లేదని ఆరోపించారు.
కంపెనీలు ఇచ్చే ఫలితాల్లో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు జీవోటి ఫలితాల్లో ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయినట్లు చూయిస్తూ రైతులకు వారికి చెల్లించాల్సిన నగదు చెల్లించడం లేదన్నారు. ఈ ఆందోళనలో నాయకులు గజేంద్ర, బుజ్జిబాబు, రైతులు పాల్గొన్నారు.
Read More |
అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే మా అభిమతం : కేటీఆర్
బీఆర్ఎస్ బీజేపీలో కలిసే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి