Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Section 22A | రిజిస్ట్రేషన్ చట్టం- 1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్, అటవీ, దేవాదాయ, వక్స్ మరియు కోర్టు వివాదాల్లో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖపై ఉంది. అయితే డిజిటైజేషన్ లోపాలు, అధికారుల, ప్రభుత్వం నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలకు శాపంగా మారింది.
Section 22A | సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : స్థిరాస్తి అంటే సాధారణ మధ్య తరగతి జీవికి అదొక భరోసా. కష్టకాలంలో ఆపద్బాంధవుడు, పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే ఆత్మీ యుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు భూ యజమానులను బాధితు లుగా మార్చింది. అసలు తప్పు ఎక్కడో ఉంటే, శిక్ష మాత్రం చట్టబద్ధంగా ఆస్తులు కొనుగోలు చేసిన నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు అనుభవించాల్సి వస్తోంది.
ప్రభుత్వం 22ఏ అంశా నికి పరిష్కారాలు చూపుతున్నామని, దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని ప్రకటనలు గుప్పి స్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం బాధితుల బతుకులు కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు పరిమితం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టం- 1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్, అటవీ, దేవాదాయ, వక్స్ మరియు కోర్టు వివాదాల్లో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖపై ఉంది. అయితే డిజిటైజేషన్ లోపాలు, అధికారుల, ప్రభుత్వం నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలకు శాపంగా మారింది. ఒక పెద్ద సర్వే నంబ ర్లో కొద్ది భాగం ప్రభుత్వానిదో, కోర్టు కేసులో ఉన్నదో అయితే.. ఆ మూల సర్వే నంబర్ మొత్తాన్ని, పాత రికార్డుల ఆధారంగా ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూము లను కూడా నిషేధిత జాబితాలోకి కాంగ్రెస్ సర్కారు నెట్టింది. ఫలితంగా ఎలాంటి వివాదాలు లేని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లు కూడా నేడు 22 -ఏ ఉచ్చులో బిగు సుకుపోయి కొట్టుమిట్టాడుతున్నాయి.
ఆచరణ శూన్యంలో..
కేవలం పేదల ఆస్తులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22 ఏ సమ స్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని, వందలాది ఫిర్యాదు. లను పరిష్కరిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని పదే పదే ప్రకటనలు ఇస్తోంది. ఇటీవల అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ), నాలా అనుమతుల వంటి అంశాలపై ప్రత్యేక మెమోలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తీరు మాత్రం మారలేదు. బాధితులు తమ సమస్యను పరి ష్కరించాలని దరఖాస్తులు చేసుకుంటే, అధికారులు పరిశీలనలో ఉంది, పైస్థాయి నించి ఆదేశాలు రావాలంటూ దాటవేస్తు న్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీవో ఆఫీస్ చుట్టూ, అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్, రిజిస్ట్రేషన్ కార్యా లయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగు తున్నా అధికారుల్లో స్పందన కరువైంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం సమస్యలు పరి ష్కరిస్తున్నామని ప్రకటిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం పాత పద్ధతిలోనే దస్త్రాలను తనిఖీల పేరిట తొక్కిపెడుతోంది. ఫలితంగా దరఖా స్తులు కార్యాలయాల్లో గుట్టలుగా మారుతున్నాయి. ఈ నిషేధిత జాబితా కార ణంగా ప్రజలు పడుతున్న యాతన వర్ణ నాతీతం. వైద్యం కోసం, పిల్లల చదు వులు, పెళ్లిళ్ల కోసం తమ సొంత ఆస్తు లను అమ్ముకుందామన్నా సాధ్యప డటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో కొన్న ప్లాట్లు, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే 22-ఏ జాబితాలో ఉందనీ రిజిస్ట్రార్లు చేతులెత్తేస్తున్నారు. టైటిల్ స్పష్టత లేదన్న కారణంతో బ్యాంకులు ఈ ఆస్తులపై రుణాలు ఇచ్చేం దుకు ముందుకు రావడంలేదు. దీంతో ఆస్తులు ఉన్నా, అప్పులపాలై మానసిక క్షోభ అనుభవిస్తున్న మధ్యతరగతి కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న బాధితు లకు నిరాశే మిగులుతోంది.
ప్రధాన డిమాండ్లు ఇవే…
ప్రభుత్వం ఇప్పటికైనా కేవలం ప్రక టనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థా యిలో కిందిస్థాయి అధికారులకు స్పష్ట మైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. ప్రైవేట్ పట్టా భూములు, స్పష్టమైన టైటిల్ ఉన్న ఆస్తులను తప్పుగా 22- ఏ జాబితాలో చేర్చినట్లయితే, అధికా రులే స్వయంగా పరిశీలించి ఆ జాబితా నుంచి తొలగించేలా ప్రత్యేక డ్రైవ్ చేప ట్టాల్సి ఉన్నా… సర్కారు స్పందించడం లేదు. బాధితులు సమర్పించిన దరఖా స్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. సాంకేతిక లోపాలు, అధికారుల అలసత్వం వల్ల తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన ఆస్తుల బాధ్యతను అధికారులు తీసుకునేలా ఆదేశాలు ఉండాలి. ప్రజల కష్టాలను తీర్చడానికి తెచ్చిన చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు బాధితులకు శాపంగా మారాయి. దీంతో కార్యాలయాల చుట్టూ తిప్పే విధానానికి స్వస్తి పలికితేనే బాధితులకు ఊరట కలుగుతుంది. లేదంటే 22-ఏ బాధితుల రోదనలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

