Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Bhu Bharati | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి వెబ్ సైట్ మొరాయిస్తోంది. గడిచిన కొంత కాలంగా సర్వర్ బీజీ అంటూ తీవ్ర ఇబ్బందులు పెడు తోంది. తాజాగా మూడు నెలల నుంచి తహసీ ల్దారు / జాయింట్ రిజిస్ట్రార్లు, మీ సేవా కేంద్రం నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లకు గురువుతున్నారు.
Bhu Bharati | కందుకూరు, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి వెబ్ సైట్ మొరాయిస్తోంది. గడిచిన కొంత కాలంగా సర్వర్ బీజీ అంటూ తీవ్ర ఇబ్బందులు పెడు తోంది. తాజాగా మూడు నెలల నుంచి తహసీ ల్దారు / జాయింట్ రిజిస్ట్రార్లు, మీ సేవా కేంద్రం నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లకు గురువుతున్నారు. తరుచూ సర్వర్ డౌన్, ఎర్రర్ 402 అని వస్తు న్నది.
ప్రధానంగా స్లాట్ బుకింగ్ స్టాంపు డ్యూటీ చెల్లించేటప్పుడు డాక్యుమెంట్, అప్ లోడ్ చేసేటప్పుడు సిటీజన్ లాగిన్ అయ్యేటప్పుడు సమ స్యలు ఉత్పన్నం అవుతున్నాయి. యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంట్రీస్ సరిగ్గా చేసినప్పటికీ, ఒకవేళ ఓటీపీ వచ్చినా లాగిన్ కావడం లేదు. చాలా సేపు లోడింగ్, సింబల్ చూపిస్తున్నది. ఆ తర్వాత లాగ్ అవుట్ అని మెసేజ్ వస్తున్నది. చాలా సార్లు స్లాట్ బుకింగ్ సమయంలో ఆ ప్రక్రియ పూర్తయిందా లేదా అన్నది కూడా అర్థం కాని దుస్థితి నెలకొన్నది. ఎన్నాళ్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కో క్కవాలని. మీ సేవా నిర్వాహకులు, ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
భూ భారతి వెబ్ సెట్ పోర్టల్‌లో సర్వర్ డౌన్ అంటూ కొంతకాలం నుంచి సమస్య వస్తు న్నది. నెలలో అత్యధిక రోజలు ఇదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్ ఇబ్బందులు పెడుతోందని ఆరోపించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని చెప్పి ధరణి నుంచి భూ భార తిగా పేరు మార్చినా, ప్రయోజనం లేదని పలువురు పేర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌లో ఒక్క నాడు కూడా సమస్యలు రాలేదని పలువురు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెప్పింది ఒకటి చేసేది మరొకటని విమర్శలు వినిపిస్తున్నారు. భూ భారతిని తీసుకువచ్చాం, ఇక మీదట ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గొప్పలు చెప్పడం మానుకోవాలని ప్రభుత్వానికి పలువురు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

