ముంబై: వన్డే వరల్డ్‌కప్‌కు చెందిన షెడ్యూల్(ODI World Cup Schedule)ను ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ముంబైలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీన టోర్నీ ప్రారంభంకానున్నది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహిచనున్నారు. ఫైనల్ మ్యాచ్‌ను కూడా అదే స్టేడియంలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 15వ తేదీన హై వోల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్నది. ఈ మ్యాచ్‌కు అహ్మాదాబాద్ వేదికగా నిలువనున్నది. 10 వేదికల్లో 46 రోజుల పాటో మెగా టోర్నీ జరగనున్నది.
https://twitter.com/JayShah/status/1673587463045152770?s=20
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఇండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనున్నది. టోర్నీలో మొత్తం 10 జట్లు ఉంటాయి. జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయిర్ టోర్నీ నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. ప్రతి జట్టు తొమ్మిదిసార్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతాయి. టాప్ నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023
హైదరాబాద్‌లో 3 మ్యాచ్‌లు
హైదరాబాద్ వేదికగా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు పాకిస్థాన్, ఒకటి న్యూజిలాండ్ జట్టు .. హైదరాబాద్ వేదికగా ఆడనున్నాయి. తొలి సెమీస్ నవంబర్ 15న ముంబైలో, రెండో సెమీస్ 16న కోల్‌కతాలో జరగనున్నాయి. నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
కీలక మ్యాచ్‌లు ఇవే..
అక్టోబర్ 13వ తేదీన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ లక్నోలో జరగనున్నది. అక్టోబర్ 20వ తేదీన బెంగుళూరులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు ముంబైలో ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఉండనున్నది. అక్టోబర్ 22వ తేదీన ధర్మశాలలో ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఉంటుంది. నవంబర్ 4వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ఉండనున్నది.
టోర్నీ వేదికలు..
మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. హైదరాబాద్, అహ్మాదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగుళూరు, ముంబై, కోల్‌కతా వేదికల్లో వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురం వేదికల్లో వార్మప్ మ్యాచ్‌లను సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నారు.
నాకౌట్ స్టేజ్..
నాకౌట్ స్టేజ్‌లో రెండు సెమీస్‌లు ఉంటాయి. ఆ రెండు సెమీస్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంచారు. నవంబర్ 19న జరిగే ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే ఇచ్చారు. నాకౌట్ దశలో జరిగే మూడు మ్యాచ్‌లను డే అండ్ నైట్ మ్యాచ్‌లుగా నిర్వహించనున్నారు. ఆ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతాయి.