న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు అద్భుతమైన షాపింగ్ కార్నివాల్ ప్రకటించింది. ఇది ఆదివారం (ఏప్రిల్ 4) నుంచి నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. యోనో యాప్ ఆధారితంగా ఈ షాపింగ్ కార్నివాల్‌ను ఖాతాదారులు ఉపయోగించుకోవచ్చు. అందుకనుగుణంగా ఎస్బీఐ ఈ కార్నివాల్‌కు.. యోనో సూపర్ సేవింగ్ డేస్ అని పేరు పెట్టింది.
ఈ నెల ఏడో తేదీ వరకు ఈ షాపింగ్ కార్నివాల్ యోనో సూపర్ సేవింగ్ డేస్ సాగుతుంది. తమ ఖాతాదారులు ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా వివిధ రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.
ఈ ఏడాదిలో ఎస్బీఐ షాపింగ్ కార్నివాల్‌ను అందుబాటులోకి తేవడం ఇది మూడోసారి. ఇంతకుముందు గత నెల నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఈ షాపింగ్ కార్నివాల్ ఖాతాదారులకు సేవలందించింది.
ఆదివారం నుంచి నాలుగు రోజులు సాగే యోనో షాపింగ్ సూపర్ సేవింగ్స్ డేస్ కార్నివాల్లో ఖాతాదారులు ప్రయాణం, ఆతిథ్యం, హెల్త్, ఆన్లైన్ షాపింగ్‌లో ఉత్తమ సేవలు అందుకోవచ్చు. 3.6 కోట్ల మంది ఖాతాదారులకు సేవలందించాలన్న లక్ష్యంతో ఎస్బీఐ ఈ షాపింగ్ కార్నివాల్ నిర్వహిస్తున్నది.
ఇందుకోసం ఎస్బీఐ యాప్ యోనో పలు టాప్ మర్చంట్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. అమెజాన్, అపోలో 24/7, ఓయో, ఈజ్ మై ట్రిప్, ఎట్ హోమ్ వంటి సంస్థలతో యోనో జట్టు కట్టింది.
హోటల్ బుకింగ్, ఫ్లయిట్ బుకింగ్, హెల్త్ క్యాటగిరీల్లో బుకింగ్స్‌పై 50 శాతం, అమెజాన్‌లో ఎంపిక చేసిన క్యాటగిరీ వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్
లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్