Thalasani | ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్యం : తలసాని
Thalasani | తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్న అనేకమంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్య కార్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పంపిణీ, చలివేంద్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Thalasani : తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్న అనేకమంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్య కార్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పంపిణీ, చలివేంద్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు 70 రోజులపాటు ఎంతో రుచికరమైన భోజనాన్ని పేదలకు అందిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వయసును లెక్కచేయకుండా సమాజానికి సేవ చేయాలనే సీనియర్ సిటిజన్ల లక్ష్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో అనేకమంది సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ సనత్నగర్లోని సీనియర్ సిటిజన్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారని అన్నారు.
కుటుంబసభ్యులతో గడపాల్సిన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప సంకల్పమని చెప్పారు. ఇక్కడ భోజనం తిని ఆకలి తీర్చుకుంటున్న పేదలు తమ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. తమ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ సిటిజన్లు జీవితాంతం నా గుండెల్లో ఉంటారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వయసులో నా కంటే పెద్దవారైన మీ ఆశీస్సులు నాపై ఉండాలని వారిని కోరారు. తనను కలవడానికి వచ్చినప్పుడు శాలువాల కోసం డబ్బు వృథా చేయవద్దని అన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

