నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే చిత్ర ప్రమోషన్లో భాగంగా ఫిబ్రవరి 28న సారంగదరియా అనే ఫోక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
మంగ్లీ పాడిన సారంగదరియా పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాటకు తగ్గట్టు అదిరిపోయే స్టెప్పులతో సాయి పల్లవి ప్రేక్షకులని ఫిదా చేయడంతో ఈ పాట యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి పాటగా రికార్డు నమోదు చేసుకుంది. గతంలో సాయి పల్లవి నటించిన పలు సినిమాలలోని పాటలు కూడా ఇంతే రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సారంగదరియా పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ పాడింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
Breaking all records!!#SarangaDariya has become unstoppable with fastest 1️⃣0️⃣0️⃣ Million views in TFI 💥
— Aditya Music (@adityamusic) April 1, 2021
►https://t.co/4Q16GiS2er#LoveStory @chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 #Suddalaashokteja @iamMangli @SVCLLP @AsianSuniel #AmigosCreations @adityamusic pic.twitter.com/xER76eGyv9