హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఇైగ్నెటెడ్ మైండ్స్ నిర్వాహకు లు, గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి బ్రిటన్‌కు చెందిన హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 17న శుక్రవారం బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం స్ఫూర్తితో స్థాపించిన ‘ఇైగ్నెటింగ్ మైండ్స్’ దేశంలో పర్యావరణోద్యమాన్ని అట్టడుగుస్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతర కృషి చేస్తున్నది. ముఖ్యంగా సంతోష్‌కుమార్ ప్రారంభించిన ‘హరా హైతో భరా హై’ (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను సత్సంప్రదాయంగా మా ర్చింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్యుల నుంచి మొదలుకొని జాతీ య, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు, సినీనటులు, వ్యాపారవేత్తలు ఈ మహోద్యమంలో పాలుపంచుకున్నారు.
గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారానికి ఎంపికైన సంతోష్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫోర్బ్స్, యూఏఈ టైమ్స్, యూరోపియన్ సన్టైమ్స్, లండన్ చానల్ న్యూస్, ఇంగ్లండ్ చానల్ న్యూస్‌లో వార్తలను ప్రచురించాయి.
గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం దక్కడం పై మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఇది తన ఒక్కడికి దక్కిన గౌరవం కాదని, పర్యావరణ పరిరక్షణోద్యమంలో భాగస్వాములైన ప్రతిఒక్కరిదని స్పష్టంచేశారు. అంతర్జాతీయ గుర్తింపుపై ఇైగ్నెటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తూ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేస్తామని స్పష్టంచేసింది.