ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి సీజన్లో ఆయనకు వరుసగా రెండో విజయం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో గత ఏడాది ఆయన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారని తెలిసింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఏప్రిల్‌లోగా పూర్తవుతుందని తెలిసింది. దీని తర్వాత వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్లో జాయిన్ అవుతారని ఫిల్మ్‌నగర్ టాక్. వినోదమే ప్రధానబలంగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌తో మరో ఫన్రైడ్కు కసరత్తులు మొదలుపెట్టారని అంటున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించిన వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.