రంగుల ప్రపంచంలో రాణించాలంటే.. అందం, అభినయంతోపాటు అదృష్టం కూడా ఉండాలని సినీపెద్దలు చెబుతుంటారు. ఆ కోవకే చెందుతుంది నటి చిత్రాంగద సింగ్. అందంలో అప్సరస, తెరపై గ్లామర్‌ను, అభినయాన్ని పండించడంలోనూ సిద్ధహస్తురాలు. అయినా.. ఇండస్ట్రీలో ఆమెకు తగినంత గుర్తింపు దక్కలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్రాంగద మాట్లాడుతూ.. బాలీవుడ్‌కు మంచి స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చింది. రచయిత తలచుకుంటే ఎంతపెద్ద హిట్ ఇవ్వగలడో చెప్పడానికి ‘దురంధర్’ సినిమానే మంచి ఉదాహరణ అంటూ అభిప్రాయపడింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చిత్రాంగద.. మోడలింగ్ నుంచి బాలీవుడ్‌కు మారింది. 2005లో వచ్చిన ‘హజారోన్ ఖ్వైషీన్ ఐసీ’ అనే క్రైమ్ డ్రామాతో తెరపై కనిపించింది. ఆ తర్వాత ఆరేళ్లపాటు సినిమాలకు దూరమైంది. మళ్లీ 2011లో ‘సింగ్ క్రైమ్ థ్రిల్లర్ యే సాలీ జిందగీ’తో తెరపై కనిపించింది. ఈ మధ్యలో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను వదులుకున్నది. ఈ విషయంపైనా గతంలో ఓసారి స్పందిస్తూ.. “కెరీర్లో నేను ఎన్నో తప్పులు చేశాను. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ వదులుకున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఒక హిట్‌ను కూడా అందుకోలేకపోయింది. అయినా.. అభిమానుల్లో మాత్రం బాగానే క్రేజ్ సంపాదించుకున్నది. చిత్రాంగద తాజా చిత్రాల సంగతి చూస్తే.. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.