‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు కసరత్తు
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి సీజన్లో ఆయనకు వరుసగా రెండో విజయం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో గత ఏడాది ఆయన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి సీజన్లో ఆయనకు వరుసగా రెండో విజయం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో గత ఏడాది ఆయన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారని తెలిసింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఏప్రిల్‌లోగా పూర్తవుతుందని తెలిసింది. దీని తర్వాత వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్లో జాయిన్ అవుతారని ఫిల్మ్‌నగర్ టాక్. వినోదమే ప్రధానబలంగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌తో మరో ఫన్రైడ్కు కసరత్తులు మొదలుపెట్టారని అంటున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించిన వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

