Sanju Samson : పొట్టి ప్రపంచకప్‌లో శివాల్తెపోతున్న భారత ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. మెగా టోర్నీలో భీకర ఫామ్‌ను కొనసాగించిన ఈ చిచ్చరపిడుగు పొట్టి కప్ సెమీఫైనల్, ఫైనల్లో అర్ధ శతకం బాదిన మూడో ఆటగాడిగా అవతరించాడు. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై, సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై అర్ధ శతకంతో రెచ్చిపోయిన సంజూ.. ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ వెటరన్ షాహిద్ ఆఫ్రిదిల సరసన చేరాడీ డాషింగ్ బ్యాటర్.
ఫైనల్లో 89 పరుగుల వద్ద ఔటైన భారత స్టార్.. మార్లోనే శామ్యూల్స్(85 నాటౌట్), కేన్ విలియమ్సన్(85) అత్యధిక స్కోర్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో విధ్వంసక ఆటతో భారత్‌ను ఫైనల్ చేర్చిన సంజూ శాంసన్.. టైటిల్ పోరులోనూ గర్జించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి 92 పరుగులతో శుభారంభమిచ్చిన సంజూ.. వరుసగా మూడో అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పాడు.
◾ Shahid Afridi in 2009
◾ Virat Kohli in 2014
◾ Sanju Samson in 2026The three batters with fifties in the semi-final and the final at the men’s T20 World Cup 🫡 pic.twitter.com/VpHBG0JvrN
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2026
🚨 HISTORY CREATE BY SANJU SAMSON IN T20I WC 🚨
• 🇮🇳 Sanju Samson created this record as the third player in the world. In the history of the T20 World Cup, Sanju Samson scored fifty runs in two consecutive knockout matches the semifinal and the final. Earlier, only Virat… pic.twitter.com/uNBABn1kWv
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 8, 2026
పొట్టి ప్రపంచకప్ సెమీస్, ఫైనల్లో ఫిప్టీ కొట్టిన రెండో భారత అటగాడిగా చరిత్రపుటల్లో నిలిచాడీ పవర్ హిట్టర్. తొలుతు పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 2009లో ఈ ఫీట్ సాధించగా.. 2014 ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ నాకౌట్లో వరుస అర్ధ శతకాలు బాదాడు. ఇప్పుడు సంజూ వీరిద్దరి సరసన నిలిచాడు.
Stunning from Samson 🙌 pic.twitter.com/wLZdeSwstJ
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2026
మొత్తంగా.. ఈ టోర్నీ చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న ఏడో ఆటగాడిగా మరో రికార్డు పట్టేశాడు శాంసన్. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తర్వాత మూడో భారతీయుడు శాంసనే కావడం విశేషం. అందరికంటే ముందు మహేల జయవర్ధనే(2010), విరాట్ కోహ్లీ(2016, 2021), బాబర్ ఆజాం(2021), కేఎల్ రాహుల్(2021), కుశాల్ మెండిస్(2026), షహిబ్జద ఫర్హాన్(2026)లు మూడేసి అర్ధ శతకాలు బాదేశారు.