‘కమిటీ కుర్రోళ్లు’తో అభిరుచి గల నిర్మాతగా కితాబులందుకున్న నిహారిక కొణిదెల నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం ‘రాకాస’. సంగీత్ శోభన్ హీరోగా మాసనశర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానున్నది. శుక్రవారం గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఓ సమస్య. ఆ సమస్యను ఛేదించేందుకు ఓ వీరుడు పుడతాడు.
తనెవరో తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు. ఈ కథలో ఆ వీరుడ్ని నేనే..’ అంటూ గ్లింప్స్ మొదలైంది. అయితే.. ఒక్కసారిగా అది కామెడీ, సెటైరికల్ టర్న్ తీసుకున్నది. సంగీత్శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి అందర్నీ నవ్వించాడు. నయన్ సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, నిర్మాతలు: కొణిదెల నిహారిక, ఉమేష్‌కుమార్ బన్సాల్.