దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఎస్సై, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. బుధవారం అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, ఫిజికల్ టెస్ట్ చీఫ్ సూపరింటెండెంట్ బాలస్వామితో కలిసి పోలీస్ మైదానాన్ని పరిశీలించారు.
- నేటినుంచి పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు
- ఏర్పాట్లు పూర్తిచేసిన పోలీస్ యంత్రాంగం
- ఉదయం 5గంటల వరకే
సంగారెడ్డి, డిసెంబరు 7: ఎస్సై, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. బుధవారం అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, ఫిజికల్ టెస్ట్ చీఫ్ సూపరింటెండెంట్ బాలస్వామితో కలిసి పోలీస్ మైదానాన్ని పరిశీలించారు. అభ్యర్థుల విద్యార్హత ధ్రువ పత్రాల నమోదుకు కంపూటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులతో కలిసి ట్రయల్న్‌న్రు పరీక్షించారు. ఆర్హెచ్ఎఫ్ఐడీ, సెన్సార్ పద్ధతులతో లాంగ్‌జంప్, షాట్‌పుట్, ఎత్తు, కొలతలు తీసుకునే విధానాన్ని ట్రయల్ రన్ నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్‌తో పాటు మైదానం నిర్వహణపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల పత్రాల తనిఖీ మొదలు పరీక్షలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లేవరకు అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అభ్యర్థులు సమయపాలన పాటించాలి
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించాలని ఎస్పీ సూచించారు. తమకు కేటాయించిన రోజు ఉదయం 5గంటలకు మైదానానికి చేరుకుని బయోమెట్రిక్, ధ్రువపత్రాల వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు పార్ట్-2 దరఖాస్తుపై సంతకం చేసి తీసుకురావాలన్నారు. ఎస్పీ వెంట సంగారెడ్డి, జహీరాబాద్ డీఎస్పీలు రవీంద్రారెడ్డి, రఘు, డీటీసీ డీఎస్పీ ప్రభాకర్, ఎఆర్ డీఎస్పీ జనార్దన్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, టెక్నికల్ టీం సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

