పెద్దశంకరంపేట/ కొల్చారం/ చిలిపిచెడ్, ఏప్రిల్ 2 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశంకరంపేటలోని దుర్గాభవానీ జాతర వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మ ఆలయం వద్ద శనివారం సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. దుర్గమ్మతోపాటు కేశమ్మ, గంగమ్మ ఆలయాల చుట్టూ మూడు ప్రదక్షిణలు, పోచమ్మ, కొండల రాయుడి ఆలయాల్లో రెండు ప్రదక్షిణతో బండ్ల ఊరేగింపు నిర్వహించారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో రావడం తో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. బద్దారం, మల్కాపురం, చీలపల్లి, ఉత్తూలూరు, శివాయపల్లి, మాడ్చెట్పల్లి , జూకల్ గ్రామాల్లో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు.
కొల్చారం మండల కేంద్రంలో పోచమ్మ, దుర్గమ్మ, తిరుమలయ్య, ఆంజనేయస్వామితోపాటు పార్శనాథుడి దేవాలయాల చుట్టూ ఎడ్ల బండ్ల ఊరేగింపు నిర్వహించారు. తుక్కాపూర్, కొంగోడు, రాంపూర్ గ్రామాల్లో బండ్లను ఊరేగించా రు. జాతర సందర్భంగా పొలీసులు బందోబస్తు చేపట్టారు.
చిలిపిచెడ్ మండలంలో రైతులు ఉగాది పండుగను పురస్కరించుని ఆలయాల్లో ఎడ్లబండ్ల్ల ఊరేంగిపు నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజాంపేట, నందిగామ గ్రామస్తులు రేణుకా ఎల్లమ్మ ఆల యాల చుట్టూ ఎండ్లబండ్ల ఊరేగింపు వైభవంగా చేపట్టారు.
ఘనంగా భర్మస్వామి మహోత్సవాలు
శివ్వంపేట, ఏప్రిల్ 2 : మండలంలోని పిల్లుట్ల గ్రామంలో భర్మస్వామి (వేంకటేశ్వరస్వామి) బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, స్వామివారికి రథోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు ఆల యానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ పెద్దపులి రవి, ఆలయ కమిటి ఛైర్మన్ హంసాన్పల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.