మనోహరాబాద్, నవంబర్ 6 : రైతు సంక్షేమమే ప్రభుత్వధ్యేయమని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట, పర్కిబండ, కూచారం గ్రామాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పర్కిబండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. మ ధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మనోహరాబాద్ జడ్పీ క్యాంపు కార్యాలయంలో తూప్రాన్ మండలం ఇమాంపూర్‌కు చెందిన పవన్గౌడ్కు రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ సుగుణమ్మ, ఎంపీటీసీలు శ్రీలత, నవనీత, సర్పంచ్‌లు సుగుణమ్మ, అర్జున్, వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, ఉప సర్పంచ్ శ్రీహరి, మహేందర్‌గౌడ్, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం పెంటాగౌడ్, ఏఈవో నరేందర్‌గౌడ్, నాయకులు పెంటాగౌడ్, రమేశ్, భిక్షపతి, శ్రీరామ్ పాల్గొన్నారు.
చిన్నచింతకుంటలో…
నర్సాపూర్,నవంబర్ 6: రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్ గౌడ్ అన్నారు. మండల పరిధిలో ని చిన్నచింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు లు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, రైతులు పాల్గొన్నారు.
బచ్చురాజ్పల్లిలో..
నిజాంపేట, నవంబర్ 6: అన్నదాతల సంక్షేమానికే ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని బచ్చు రాజ్ పల్లి సర్పంచ్ నర్సవ్వ అన్నారు. మండలంలోని బచ్చు రాజ్‌పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యంలో నాణ్యత ప్రామాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు.
జడ్చెరువుతండాలో…..
జడ్చెరువు తండాలో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అరు ణ్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సురేశ్, బచ్చురాజ్‌పల్లి ఉపసర్పంచ్, రైతు బంధు సమితి గ్రా మ కో-ఆర్డినేటర్ మల్లేశం, రాజు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ మంగ్యానాయక్, ఏఈవో శ్రేయ, సీసీ మల్లేశం, మహిళ గ్రూపు సభ్యులు, గ్రామస్తులు మల్లేశం, గోపాల్, నరేందర్, రైతులు ఉన్నారు.
ఝాన్సీలింగాపూర్‌లో…
రామాయంపేట రూరల్, నవంబర్ 6: మండల పరిధిలోని ఝాన్సీలింగాపూర్‌లో పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామాయంపేట ఎంపీపీ భిక్షపతితో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య ఉన్నారు.
కోమటిపల్లిలో…
రామాయంపేట, నవంబర్ 6: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ధాన్యం డబ్బులను నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరిరెడ్డి, సొసైటీ సీఈవో నర్సింహులు, మాజీ ఎంపీటీసీ సిద్ధ్దిరాంరెడ్డి, మాజీ సర్పంచ్ ఉడుత సిద్ధయ్య పాల్గొన్నారు.