పాపన్నపేట, నవంబర్ 2 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం మండల కేంద్రమైన పాపన్నపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ ఇమాన్యుల్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత డాక్టర్‌తో ఆమె ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు సోములు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జగన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుబేరుడు, కో-ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు మూర్తిగౌడ్, వెంకట్రాములు, ఎంపీటీసీ శ్రీనివాస్, డాక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
చేగుంట, నవంబర్ 2 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఎంపీపీ చిందం సబిత సూచించారు. మంగళవారం నార్సింగి మండలం జెప్తిశివునూర్, సంకాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్ గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్ షేక్ షరీష్, ఆర్.సుజాత, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, రైతుబంధు మండల అధ్యక్షుడు లింగారెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, నా యకులు రాజేశ్, రవీందర్, రైతులు పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట, నవంబర్ 2 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట వైస్ ఎంపీపీ అందె ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి సూచించారు. మంగళవారం నిజాంపేట మం డలం కల్వకుంట, రజాక్‌పల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో రజాక్‌పల్లి నర్పంచ్ సునీత, టీఆర్ఎస్ నాయ కులు, అధికారులు పాల్గొన్నారు.