Samsung Galaxy F 17 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ సరికొత్త 5జీ మొబైల్‌ను లాంచ్ చేయబోతుంది. Samsung Galaxy F 17ను తొందరలోనే భారత విపణిలోకి తీసుకురానుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను శాంసంగ్ కంపెనీ రిలీజ్ చేయడానికి ముందే దీని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.
పలు ఆన్లైన్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌గా మారాయి. ఆ లీకుల ప్రకారం.. ప్రకారం ఈ మొబైల్ ఎక్సీనోస్ 1330 చిప్సెట్ ప్రాసెసర్‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ, సూపర్ AMOLED డిస్ప్లే, 90 హెడ్జ్ రీఫ్రెష్‌తో వస్తుంది. స్క్రీన్‌పై స్క్రాచ్‌లు పడకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్‌ను ఇస్తున్నారు. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారని తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. కాగా, ఇందులో చార్జర్ రావడం లేదని లీకుల ద్వారా తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో ఈ మొబైల్ వస్తుంది. ఇందులో ఆరు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్తో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందించనున్నారని సమాచారం. ఇందులో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయని లీకుల్లో చెబుతున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధరను 14,499 రూపాయలుగా నిర్ణయించినట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,599గా నిర్ణయించారని సమాచారం.
ఈ స్మార్ట్ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్ డేట్స్ తో పాటు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. అలాగే బాక్స్ లో ఛార్జర్ ని కూడా కంపెనీ ఇవ్వడం లేదని లీకుల ద్వారా తెలుస్తుంది.