ముంబై: సమర్థ రామదాసు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు అని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్రలోని శివాజీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమర్థ రామదాసు ఎప్పుడూ కూడా ఛత్రపతి శివాజీకి గురువుగా లేరని, గవర్నర్ తన స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడాలని బీజేపీ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలే హితవు పలికారు. శివాజీ తల్లి మాత్రమే ఆయనకు అసలైన గురువని పేర్కొన్నారు. గవర్నర్ వ్యాఖ్యలను బీజేపీ సమర్థిస్తున్నదా లేదా అనే విషయం చెప్పాలని ఎన్సీపీ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.