Samantha | సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటాయి. ఇటీవల ఆమె, దర్శకుడు రాజ్ నిడిమోరుతో స్నేహం, తరచు హాలిడే ట్రిప్స్, కలిసి గడిపే సమయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. వీరి రిలేషన్‌షిప్‌పై అనేక రూమర్స్ వినిపిస్తునప్పటికీ, ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఇద్దరూ పబ్లిక్‌గా పలుమార్లు కలిసి కనిపించడం, ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. తాజాగా ఈ జంట మరోసారి ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న రెండో సినిమా ‘మా ఇంటి బంగారం’ పూజా కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు, సమంత పక్కపక్కనే కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా రాజ్ నిడిమోరు దేవుడి పటాలపై క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. సమంత ఇప్పటికే ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రాజ్ నిడిమోరు అన్ని విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ఆయన హిమాంక్ దువ్వూరితో కలిసి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం దీపావళి తర్వాత, అక్టోబర్ 27న చేశారు. “కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ సమంత సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు.
‘ఓ బేబీ’ బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ సమంత – నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇదే. ఇందులో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, యాంకర్ మంజుషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సీతా మీనన్, వసంత్ మరింగంటి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ ఓం ప్రకాశ్, సంగీతం సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల బాధ్యతలు వహిస్తున్నారు. సమాచారం ప్రకారం, “మా ఇంటి బంగారం” సినిమా 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్‌ల మిశ్రమంగా సాగే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.సమంత – నందినీ రెడ్డి కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? అన్నది ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨
We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025