Sam Curran : స్వదేశంలో వేసవి మ్యాచ్‌లకు పక్కాగా సిద్ధమవ్వాలనుకున్న ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. బెన్ స్టోక్స్ వారసుడిగా జట్టుకు కొండంత బలం అవ్వాల్సిన సామ్ కరన్(Sam Curran) మళ్లీ గాయపడ్డాడు. ఈసారి గాయం తీవ్రత కారణంగా సర్జరీ అనివార్యమైనందున.. వచ్చే ఏడాది వేసవిలో జరిగే అన్ని మ్యాచ్‌లకు ఈ పేస్ ఆల్‌రౌండర్ దూరం కానున్నాడు. ఈ విషయాన్నిసర్రే క్రికెట్ ధ్రువీకరించింది. గజ్జల్లో గాయంతో సమ్మర్ సీజన్ మొత్తానికి కరన్ అందుబాటులో ఉండడని సర్రే వెల్లడించింది.
ఈమధ్య తరచూ గాయపడుతున్న సామ్ కరన్ మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని ఈ పేస్ ఆల్‌రౌండర్ వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండడం లేదు. గజ్జల్లో గాయం కారణంగా.. అతడికి సర్జరీ చేయాల్సి ఉందని సర్రే క్రికెట్ పేర్కొంది.
Update: Sam Curran will miss the rest of England’s home fixtures this season due to a groin injury, while Will Jacks is recovering having had a successful operation to remove his appendix pic.twitter.com/wlozOAvX7l
— Cricinfo (@cricinfo) August 20, 2026
‘సామ్ మాకు కీలకమైన ఆటగాడు. భవిష్యత్‌లో ఆల్‌రౌండర్‌గా అతడి సేవలు అందించనున్నాడు. అందుకని అతని మా వైద్యబృందం పరీక్షిస్తోంది. అతడికి ఆగస్టు 21 శుక్రవారం సర్జరీ ఉంది అని సర్రే వెల్లడించింది. అయితే.. గజ్జల్లో గాయం అంటూ ఐపీఎల్ 19వ సీజన్‌కు దూరమైన సామ్ కరన్.. ది హండ్రెడ్ లీగ్‌లో ఆడడంపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మండిపడిన విషయం తెలిసిందే.