Ameer Log | ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం అమీర్ లోగ్ (Ameer Log). వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రమణారెడ్డి సోమ మాట్లాడుతూ.. అమీర్ లోగ్ సినిమాను ఇప్పటికీ చాలా సార్లు చూశామన్నాడు. ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు.. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ చేశాను. ప్రీమియర్లకు వస్తే మేం హిట్టు కొట్టేశాం.. అనుకున్నది సాధించేశామని అర్థమైంది. మలయాళంలో తీసినట్టుగా మన దగ్డర రావడం లేదంటుంటారు కదా.. ఇకపై హైదరాబాద్ ఎరా మొదలైంది. ఆగస్టు 21న నైజాంలో మొదలయ్యే సౌండ్ అన్ని వుడ్లకు చేరుకుంటుందని చెప్పుకొచ్చాడు.
అమీర్‌లోగ్ సినిమాకు తనకు మంచి అవకాశంతోపాటు కుటుంబాన్ని, అనుభవాన్నిచ్చిందని యాక్టర్ ఎంసీ హరి అన్నాడు. నటి వేద జలంధర్ మాట్లాడుతూ.. మా కరీంనగర్లో సినిమా చూసిన వారంతా నా గురించే అడిగారట. మా సినిమాలో నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. ఆగస్టు 21న సినిమా చూడండి.. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఫుల్ మీల్స్ తిన్నట్టుగా, కడుపు నిండినట్టుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ మీద తనకున్న ప్రేమను రమణన్న ఈ అమీర్ లోగ్ సినిమాతో చూపించబోతున్నాడని.. ఏపీతోపాటు కరీంనగర్, వరంగల్‌లో వచ్చిన ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని యాక్టర్ యోగి అన్నారు.
అమీర్ లోగ్ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను టాలీవుడ్ యాక్టర్ రానాకు చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకుంది. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.
Presented by @SpiritMediaIN! #AmeerLog is bringing proper Hyderabadi entertainment straight to the big screen. Book your tickets now on @District_India #AmeerLogOnAug21 pic.twitter.com/1DaigP9MyH
— Sana Reddy (@ReddySanaa9308) August 20, 2026
Confidence chusthunte movie pakka blockbuster Anukunta 💥
Grand Release Tomorrow #AmeerLog BOOKINGS ARE OPEN NOW!
Grab your tickets on @bookmyshow & @district_india apps and get ready for a full-on Hyderabadi entertainer! pic.twitter.com/ioArbbhIuK
— Siva Kurapati (@Sivakurapati626) August 20, 2026