సల్మాన్‌ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ (2015) చిత్రం హిందీ చిత్రసీమలో సంచలనం సృష్టించింది. మానవీయ స్పృహ, వినోదం మేళవించిన కథాంశంతో ప్రేక్షకులందరిని మెప్పించింది. దాదాపు 900కోట్ల కలెక్షన్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథనందించారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై సల్మాన్‌ఖాన్ ప్రకటన చేశారు. ఇటీవల ముంబయిలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో సల్మాన్‌ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘భజరంగీ భాయ్‌జాన్’ సీక్వెల్ చేయబోతున్నానని..విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్నారని తెలిపారు. సీక్వెల్‌కు కొత్త దర్శకుడు పనిచేయబోతున్నట్లు తెలిసింది.