Revathi-kajol movie | సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సలామ్ వెంకీ. బిలైవ్ ప్రొడక్షన్స్, టేక్23 స్టూడియోస్ బ్యానర్లపై సూరజ్సింగ్, శ్రద్ధా అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాజోల్ ‘అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.
Today we begin the journey of a story that needed to be told, a path that had to be taken and a life that had to be celebrated. We can’t wait to share this unbelievably true story of #SalaamVenky with you❤️#Revathy @isinghsuraj @Shra2309 @BliveProd @Take23Studios #varshakukreja pic.twitter.com/dW93VYgVOc
— Kajol (@itsKajolD) February 11, 2022