హైదరాబాద్, నవంబర్ 18: అంతర్జాతీయ హోం సొల్యూషన్స్ కంపెనీ సెయింట్ గోబైన్ వివిధ ఉత్పత్తుల్ని హైదరాబాద్‌లో ప్రవేశపెట్టింది. మై హోం బ్రాండ్‌తో విండోస్, షోయర్ క్యుబికల్స్, సీలింగ్స్, కిచెన్ వార్డ్రోబ్ షట్టర్స్, రూఫింగ్ ఉత్పత్తులు, మిర్రర్స్‌ను కంపెనీ విక్రయిస్తున్నది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తమ సొల్యూషన్స్‌తో కూడిన స్టోర్స్‌ను ఏర్పాటుచేశామని, త్వరలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్టోర్ ప్రారంభించనున్నట్లు సెయింట్ గోబైన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ ఖురానా చెప్పారు.