Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య గురించి వైరల్ అవుతున్న నిజాలు.. లాయర్ మాత్రమే కాదు!
Sai Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన భార్య కావ్యా రెడ్డి గురించి ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కావ్యకి సినీ నేపథ్యం లేదని తెలుస్తోంది. ఆమె తాత జడ్జి కాగా, తండ్రి లాయర్‌గా పనిచేస్తున్నారు.
Sai Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో తిరుమలలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన భార్య కావ్యా రెడ్డి గురించి ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కావ్యకి సినీ నేపథ్యం లేదని తెలుస్తోంది. ఆమె తాత జడ్జి కాగా, తండ్రి లాయర్‌గా పనిచేస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన కావ్యా రెడ్డి, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పరిచయమై, ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం.కావ్యా రెడ్డి కేవలం లాయర్ మాత్రమే కాదు.. జర్నలిజంలో కూడా ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తన ఆసక్తిని బిజినెస్‌గా మార్చుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్నారట. దీంతో ఆమె టాలెంట్ చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “బెల్లంకొండకు మంచి బిజినెస్ ఉమెన్ భార్యగా వచ్చింది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించగా, తొలి సినిమాతోనే సాయి శ్రీనివాస్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇటీవల తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రెండేళ్లుగా ప్రేమిస్తున్న కావ్యా రెడ్డితో ప్రీ-ఎంగేజ్మెంట్ జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, 2026 ఏప్రిల్ 29న తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

